![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. మొన్నటి ఎపిసోడ్ లో శివాజీ వాళ్ళ కొడుకు వెంకట్ రావడంతో మోస్ట్ ఎమోషనల్ గా సాగింది ఎపిసోడ్.. ఆ తర్వాత అంబటి అర్జున్ భార్య సురేఖ రావడం, తనకి సీమంతం చేయడం అదంతా ఆకట్టుకోగా, కాసేపటికి అశ్వినిశ్రీ వాళ్ళ అమ్మ వచ్చి బోరున ఏడిపించేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి మొదటగా గౌతమ్ వాళ్ళ అమ్ మంగ వచ్చింది.
కన్నయ్య... అంటూ అమ్మ పిలుపు విని హౌస్ లోని వాళ్ళంతా ఆశ్చర్యకరంగా గేట్ వైపు చూశారు. ఎవరు రాకపోవడంతో హౌస్ మేట్స్ అంతటా వెతికారు. ఇక కన్నయ్య పంచె వచ్చిందా అని వినపడగానే గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. కాసేపటికి మెయిన్ గేట్ నుండి గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చీ రాగానే గౌతమ్ ని హత్తుకొని ఏడ్చేసింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో.. గౌతమ్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిందంటూ చెప్పుకొచ్చింది. కాసేపటికి యావర్ కి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోషనల్ అవ్వగా.. నేను కూడా నీకు అమ్మనే, బయటకు వచ్చాకా మా ఇంటికి రా యావర్ అంటు గౌతమ్ వాళ్ల అమ్మ అంది. ఇక హౌస్ మేట్స్ అందరికి గోరుముద్దలు తినిపించగా ప్రతీ ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆట బాగా ఆడుతున్నావ్. ఇలాగే ఉండు. నీలాగే ఉండు అంటు గౌతమ్ కి వాళ్ళ అమ్మ కొన్ని విషయాలని షేర్ చేసింది.
కాసేపటికి లవ్ సాంగ్ వేశాడు బిగ్ బాస్. దాంతో ఎవరి బాయ్ ఫ్రెండో లేక గర్ల్ ఫ్రెండో వస్తుందని అనుకున్నారంతా. అనుకున్నట్టే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ వచ్చాడు. వచ్చీ రాగానే ఎర్రగులాబీతో ప్రపోజ్ చేశాడు. హౌస్ మేట్స్ అంతా అలానే చూస్తు ఉండిపోయారు. కాసేపటికి పెళ్ళెప్పుడు శివ్ అని ప్రియాంక అడుగగా.. నువ్వు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే చేసుకుందామని శివ్ అన్నాడు. కాసేపటికి శోభాశెట్టి వచ్చి శివ్-ప్రియంకలతో మాట్లాడింది. " హౌస్ లో నువ్వు ఒక్కదానిగానే ఆడు. బయట నీ ఫ్రెండ్స్ అయిన ఇక్కడ నువ్వు కప్పు కోసం వచ్చావ్.
దాని కోసం ఇండివిడ్యువల్ గా ఆడు. అవతలి వాళ్ళు నీకు ఎంత కోపం తెప్పించాలని చూసిన అగ్రెసివ్ అవ్వకు. ఏదైనా గొడవ జరిగితే అక్కడే వదిలేసేయ్" అంటూ ప్రియాంకతో శివ్ అన్నాడు. ఇక వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని బిగ్ బాస్ అనగానే ప్రియాంకకి ముద్దుచ్చి బయటకొచ్చేశాడు. ఇద్దరు కాసేపు ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత భోలే షావలి భార్య హౌస్ లోకి వచ్చింది. వచ్చీ రాగానే భోలే ఏడ్చేశాడు. నా ఆట ఎలా ఉందని అడుగగా. బాగుందని భోలే భార్య అంది. హౌస్ మేట్స్ అందరిని పరిచయం చేసిన భోలే.. తన భార్య కోసం పాట కూడా పాడాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు గురించి అడిగి ఎమోషనల్ అయ్యాడు భోలే. కాసేపటికి భోలే భార్య బయటకొచ్చేసింది. ఇలా హౌస్ లో ఒక్కో ఫ్యామిలీ ఎంట్రీ గుండెల్ని పిండేసింది.
![]() |
![]() |